Surprise Me!

Rana Daggubati Hilarious Act With Anchor Suma At Jersey Success Meet || Filmibeat Telugu

2019-04-29 3,042 Dailymotion

Jersey movie success meet. Hilarious conversation between rana daggubati and suma.
#jerseysuccessmeet
#jersey
#nani
#ranadaggubati
#Jerseycollections
#GowthamTinnanuri
#ShraddhaSrinath
#tollywood

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ...సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులైంది. జెర్సీ సినిమా చూసిన తర్వాత తప్పకుండా తప్పకుండా సక్సెస్ మీట్‌కు రావాలని అనుకొన్నాను. నాకు జీవితంలో కొన్ని విషయాలు అర్థం కావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు అర్థం కాని విషయాలు. అలాంటి నాకే జెర్సీ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఊహించుకోలేను అని రానా అన్నారు.